చదువుతో పాటు ఆటలూ ముఖ్యమే: మంత్రి నిరంజన్ రెడ్డి

Thu,August 22, 2019 06:28 PM

education also sports very important for students says minister

వనపర్తి: విద్యార్థులు చదువుతో పాటు ఆటలకు(క్రీడలు) కూడా ప్రాముఖ్యతనివ్వాలని వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు పూర్తిగా సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు ఆయన వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట గిరిజన బాలికల గురుకుల కళాశాలలో ఐదు రోజుల పాటు నిర్వహించనున్న టీ-10 క్రికెట్ ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ... ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, అందుకనుగుణంగా అనేక గురుకుల పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలతో పాటు విద్య, క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మన గురుకుల విద్య దేశానికే ఆదర్శమని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. టీ-10 క్రికెట్ లీగ్‌లో క్రీడామణులు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలనీ, ప్రతి మహిళా క్రికెటర్ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఫేమస్ క్రికెటర్ మిథాలీరాజ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. మొదటి మ్యాచ్ మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల జట్ల మధ్య జరగనుండగా మంత్రి బ్యాటింగ్ చేసి ప్రారంభించారు.
కార్యక్రమంలో జెడ్పీ ఛైర్మన్ ఆర్. లోకనాథ్, ఎంపీపీ కిచారెడ్డి, ఐటీడీఏ పీఓ వెంకటయ్య,స్పోర్ట్స్ ఆఫీసర్ రమేష్‌కుమార్, రీజనల్ కో ఆర్డినేటర్ కళ్యాణి, ఆర్డీవో చంద్రారెడ్డి, క్రికెట్ అకాడమీ కోచ్ ఆంజనేయులు, వివిధ జట్ల క్రికెటర్లు పాల్గొన్నారు.


609
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles