టీఆర్‌ఎస్‌కు కార్యకర్తలే సుప్రీమ్..!

Sun,August 25, 2019 08:21 PM

Errabelli Dayakar Rao Speech At TRS Party Cadre Meeting In  warangal

వరంగల్ రూరల్: టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే సుప్రీం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం పరకాల శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ పట్టణ శివారులోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాలులో జరుగగా ముఖ్య అతిథిగా మంత్రి దయాకర్‌రావు హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీపై ఇతర పార్టీలు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని, కార్యకర్తలు వాటిని తిప్పికొట్టాలన్నారు. టీఆర్‌ఎస్‌ను చూస్తే ఇతర పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు.

సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం అందుకు నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్టు అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలను, రైతులను పాలకులు ముప్పుతిప్పలు పెట్టారని, అందుకోసమే ప్రజలు ఆ పార్టీని పాతాళానికి తొక్కారని అన్నారు. జనం మద్దతు లేని పార్టీ ఏదైనా ఉంటే అది బీజేపీ ఒక్కటేనన్నారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ సత్తా ఏంటో మరోసారి ఆ పార్టీలకు తెలుస్తుందని చెప్పారు. కార్యకర్తలు సమన్వయంతో కలిసికట్టుగా ఉండాలని కోరారు.

762
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles