పటాకులు కాల్చేటపుడు కండ్లు జాగ్రత్త..

Thu,October 19, 2017 06:48 AM

హైదరాబాద్ : రంగురంగుల వెలుగులు, ఆనందాల మధ్య జరుపుకోవాల్సిన దీపావళి పండుగ చిన్నపాటి తప్పిదాలతో జీవితాన్నే చీకటిగా మార్చివేసే ప్రమాదముంది. పటాకులు కాల్చే సమయంలో అప్రమత్తంగా ఉండకపోతే ముఖ్యంగా చిన్నపిల్లలు ప్రమాదాలకు గురవుతున్నారు. చిన్నపిల్లలు పటాకులు కాల్చే సమయంలో వారి వద్ద పెద్దవాళ్లు ఉండకపోవడం, సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో ఇష్టానుసారంగా కాల్చుతారు. ఒక్కోసారి గాయాలకు గురవుతారు. చాలా మంది కండ్లు పోగొట్టుకున్న సందర్బాలు ఉన్నట్లు సరోజినీదేవి కంటి దవాఖాన ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డా.రవీందర్‌గౌడ్ తెలిపారు.


ofc-crackers
ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా నిర్లక్ష్య వాతావరణంలో పటాకులు కాల్చి, కాలిన గాయాలకు గురై చూపు దెబ్బతిన్న బాధితులు పదుల సంఖ్యలో సరోజినికి వస్తుంటారని ఆయన తెలిపారు. అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ దీపావళి సమయంలో ప్రజలు, చిన్నారులు జాగ్రత్తలు పాటించి ఆనందంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. ప్రమాదాలకు గురైన వారికి చికిత్స అందించేందుకు సరోజినీదేవి కంటి వైద్యశాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు రెండు ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశామని, ఈ వైద్య బృందాలు 24 గంటలు దవాఖానలో అందుబాటులో ఉంటాయన్నారు. అత్యవసర చికిత్స, శస్త్ర చికిత్సలు సైతం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు.

ఈ జాగ్రత్తలు పాటించాలి..
n చైనా పటాకులు ప్రమాదకరంగా ఉన్నాయి. వాటికి దూరంగా ఉండడం మంచిది.
n నాణ్యమైన, గుర్తింపుగల కంపెనీలకు చెందిన పటాకులు మాత్రమే కొనుగోలు చేయాలి.
n పిల్లలను ఒంటరిగా కాల్చేందుకు అనుమతి ఇవ్వవద్దు. పెద్దవారు తప్పనిసరిగా వారి వెంట ఉండాలి.
n మైదానాలు, ఖాళీ స్థలాల్లో మాత్రమే కాల్చాలి.
n ముందుజాగ్రతగా దగ్గరలో కనీసం రెండు బక్కెట్ల నీటిని అందుబాటులో పెట్టుకోవాలిపటాకులను కాల్చే సమయంలో కళ్లకు ప్రొటెక్టడ్ గ్లాసెస్‌ను పెట్టుకోవడం ఉత్తమం.

ప్రమాదాలు జరిగినప్పుడు:
చిన్నచిన్న కాలిన గాయాలు జరిగిన వెంటనే గాయంపై నీటిని పోయాలి. ఒంటికి మంటలు అంటుకున్న సందర్భంలో శుభ్రమైన కాటన్ బెడ్‌షీట్ లేదా దుప్పటితో మంటలను ఆర్పివేసి వెంటనే దగ్గరలో ఉన్న దవాఖానకు తరలించాలి. ముఖానికి కాలిన గాయాలైనప్పుడు ముఖ్యంగా కండ్లపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

గాంధీ, ఉస్మానియాలో ప్రత్యేక ఏర్పాట్లు
కాలిన గాయాలకు గురైన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఉస్మానియా, గాంధీ దవాఖానల్లోని బర్నింగ్ వార్డుల్లో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వైద్యాధికారులు తెలిపారు.

2678
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles