అలరించిన బాణాసంచా.. లేజర్ వెలుగులు..

Tue,December 19, 2017 08:57 PM

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. ఎల్బీస్టేడియంలోని పాల్కురికి సోమనాథుని ప్రాంగణంలోని బమ్మెర పోతన వేదికపై ముగింపు వేడుకలు కన్నుల పండువగా కొనసాగాయి. ముగింపు వేడుకల చివరగా.. బాణాసంచా అలరించింది. లేజర్ వెలుగులు హైలెట్ గా నిలిచాయి. సుమారు పది నిమిషాల పాటు లయబద్ధమైన ధ్వనుల మధ్య బాణాసంచాను కాల్చి.. లేజర్ వెలుగులను ప్రదర్శించారు. తెలుగు సాహితీవేత్తలు, భాషాభిమానులు వేల సంఖ్యలో రావడంతో లాల్ బహదూర్ స్టేడియం శోభాయమానంగా మారింది. ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ హాజరయ్యారు.


2576
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles