నాల్గవ మోటర్‌ వెట్‌ రన్‌ విజయవంతం

Wed,May 15, 2019 07:43 PM

Fourth wet run success in nandi medaram pump house in kaleshwaram project

పెద్దపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు ఆరో ప్యాకేజీలో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం వద్ద భూగర్భంలో నిర్మించిన పంప్‌హౌస్‌లోని నాలుగో మోటార్‌ పంపు వెట్‌ రన్‌ విజయవంతమైంది. ఈ ట్రయల్‌ రన్‌ను సీఎం ఓఎస్‌డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. నేడు మధ్యాహ్నం చేపట్టిన మూడో పంపు వెట్‌ రన్‌ విజయవంతమైన విషయం తెలిసిందే. గత నెల 24, 25వ తేదీల్లో అధికారులు మొదటి, రెండో మోటర్ల వెట్‌ రన్‌ నిర్వహించారు. ఇవాళ మూడో, నాల్గవ మోటర్‌ వెట్‌ రన్‌లను చేపట్టారు. నేడు ఒక్క రోజే రెండు పంపుల వెట్‌ రన్‌ విజయవంతంలో అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లింకు-2లో భాగంగా నంది మేడారం వద్ద అండర్‌ టన్నెల్‌లో భారీ పంపు హౌస్‌ నిర్మించారు. ఇక్కడికి వచ్చిన నీటిని పక్కనే ఉపరితలంలో ఉన్న మేడారం రిజర్వాయర్‌లో ఎత్తిపోసేందుకు పంప్‌హౌస్‌లో ఏడు భారీ మోటర్లు ఏర్పాటు చేశారు.

1527
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles