సేఫ్‌ షాప్‌ పేరుతో మోసాలు..11 మంది అరెస్ట్‌

Thu,September 12, 2019 06:46 AM

fraud with multilevel marketing name


హైదరాబాద్ : మల్టీ లెవల్‌ మార్కెట్‌ అంటూ ప్రజలకు ఎక్కువ కమీషన్‌ ఆశ చూపి మోసం చేస్తున్న 11మంది వ్యక్తులను నేరేడ్‌మెట్‌ పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ నర్సింహాస్వామి కథనం ప్రకా రం.. వినాయక్‌నగర్‌లో నివాసముంటున్న 11 మందికార్యాలయం ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.10వేలు తీసుకుని.. ముగ్గురిని ఈ స్కీంలో చేర్పిస్తే నెలకు రూ.800వందలు కమీషన్‌ ఇస్తామని డబ్బులు వసూలు చేశారు.

ఓ బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితులు గాజుల నరేందర్‌ (31), శ్యామకూర సంపత్‌ (28), ఎండీ యాకూబ్‌ పాష (30), కొన్నె రాజ్‌కుమార్‌ ( 29), అశోక్‌ ( 33), బెల్లపు కోటేష్‌ ( 28), స్వామి ( 35), శ్రీనివాస్‌ ( 28), శివకుమార్‌ ( 21), రాపోలు శివ ( 28), అరవింద్‌ ( 22)లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ల్యాప్‌టాప్‌లు, 4 బైక్‌లు, 10 సెల్‌ఫోన్‌లు, తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

837
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles