కార్పొరేట్‌కు దీటుగా పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

Sun,June 9, 2019 08:24 PM

free competitive exams training by vijayamma foundation in godavarikhani

గోదావరిఖని: కార్పొరేట్ సంస్థలకు దీటుగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చి తీరుతామని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మున్సిపల్ కార్యాలయంలో విజయమ్మ ఫౌండేషన్, ఎన్టీపీసీ సీఎస్‌ఆర్ సౌజన్యంతో 40 రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణా శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకులాల విద్యార్థులు కార్పొరేట్ స్థాయి విద్యాలయాల కంటే అత్యధిక మార్కులు సాధించి అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని ఆయన ఉదహరించారు.

స్వరాష్ట్రంలో ఒకేసారి 542 గురుకులాలు ప్రారంభించి ఒక్కో విద్యార్థికి రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని నిరుద్యోగుల కోసం బ్యాంక్, రైల్వే తదితర పోటీ పరీక్షలకు కోరుకంటి విజయమ్మ ఫౌండేషన్, ఎన్టీపీసీ సీఎస్‌ఆర్ సౌజన్యంతో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు మంచి మార్గదర్శనం చేసే ఇలాంటి కార్యక్రమాలను మంత్రి అభినందించారు.

ఉన్నతమైన స్థాయిలో ఇస్తున్న కోచింగ్‌ను విద్యార్థులు వినియోగించుకుని మంచి ఉద్యోగావకాశాలు పొందాలని ఆయన ఆకాంక్షించారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో యువత ముందుకు సాగాలని మంత్రి అభ్యర్థులకు ఉద్భోదించారు.

2730
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles