నగరంలో కొనసాగుతోన్న గణపతుల శోభాయాత్ర

Thu,September 12, 2019 08:39 AM

ganesh shobha yatra started in hyderabad


హైదరాబాద్ : భాగ్యనగరంలో గణపతుల శోభాయాత్రలు ప్రారంభమయ్యాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి గణనాథులు నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ కు తరలివస్తున్నరు. హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ పై అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 50 ప్రాంతాల్లో నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు వేల మంది పోలీసులతో నగరంలో పటిష్టబందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర జరిగే మార్గాల్లో పోలీసులు సీసీ కెమెరాలు బిగించారు. సుమారు 10 వేల మంది కార్మికులు పారిశుద్ధ్యపనుల్లో నిమగ్నమయ్యారు. గణపయ్యల శోభాయాత్రతో భాగ్యనగరంలో సందడి వాతావరణ నెలకొంది.

489
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles