సీఆర్‌ఎం కింద నగర రోడ్ల నిర్వహణ

Mon,October 21, 2019 08:45 PM

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ సిబ్బంది, జోనల్ కమిషనర్లతో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. దీర్ఘకాలంగా నగర రోడ్ల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం(సీఆర్‌ఎం) కింద నగరంలోని 709 కిలోమీటర్ల ప్రధాన రహదారుల నిర్వహణకు టెండర్లు పిలవాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం రోడ్ల గుంతలు పూడ్చివేత, నూతన రోడ్లు, లేయర్ల వంటి వాటికి వేర్వేరు టెండర్లు పిలుస్తామన్నారు. రోడ్లు, ఫుట్‌పాత్‌లు తవ్వాలంటే కనీసం ఆరు నెలల ముందే సమాచారం అందించాలని కేటీఆర్ సూచించారు. రోడ్ల తవ్వకాలు, ఆ వెంటనే పూడ్చే బాధ్యత పూర్తిగా వర్కింగ్ ఏజెన్సీలదే అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.



602
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles