దొందూ దొందే... భార్యాభర్తలిద్దరూ లంచావతారాలే..!

Sat,August 31, 2019 10:25 PM

GHMC Superintendent Venkateshwar Nayak is in ACB custody

హైదరాబాద్‌: గత నెల రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్‌ లావణ్య అక్రమాస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువకముందే ఆమె భర్త కూడా లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కాడు. లావణ్య భర్త వెంకటేశ్వర్‌ నాయక్‌ జీహెచ్‌ఎంసీ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి వద్ద రూ.2.5 లక్షలు లంచం తీసుకున్నాడు. లంచం సొమ్మును తన బ్యాంకు ఖాతాలో వేయించుకున్నాడు. వెంకటేశ్వర్‌ నాయక్‌తో పాటు మధ్యవర్తి కందూకురి ప్రకాశ్‌ కూడా ఏసీబీ అధికారులకు చిక్కాడు. లావణ్య, వెంకటేశ్వరనాయక్‌ ఇంట్లో సోదాలు చేపట్టిన ఏసీబీ రూ.93 లక్షలు గుర్తించి స్వాధీనం చేసుకున్న సంగతి విధితమే.

1593
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles