సెల్‌ఫోన్ చార్జింగ్‌ పెడుతూ.. విద్యుత్‌ షాక్‌తో విద్యార్థిని మృతి

Sun,May 26, 2019 10:40 PM

girl student died with electric shock while charging cell phone in peddapalli

పెద్దపల్లి: జిల్లాలోని పాలకుర్తి మండలం మారేడుపల్లి గ్రామానికి చెందిన మండల జ్యోతి(15) ఇంట్లో సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మండల స్వామి కూతురు జ్యోతి, ఇంట్లో సెల్‌ఫోన్‌కు చార్జింగ్‌ పెడుతుండగా కరెంట్ షాక్ తగిలి కిందపడిపోయింది. వెంటనే కుటుంబీకులు ధర్మారంలోని దవాఖానకు తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. జ్యోతి ఇటీవలే పదో తరగతి పలితాల్లో 8.7 జీపీఏ సాధించింది. సంఘటన స్థలానికి ట్రాన్స్‌కో ఏఈ సుజిత్, బసంత్‌నగర్ ఎస్‌ఐ ఉమాసాగర్ చేరుకొని వివరాలు సేకరించారు. జ్యోతి తల్లి స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఉమా సాగర్ తెలిపారు.

4477
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles