గీతం ప్రవేశ ప్రక్రియ ప్రారంభం

Tue,November 19, 2019 09:59 PM

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్టు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ చెప్పారు. 2020-21 విద్యాసంవత్సరం అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను విడుదలచేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే విద్యాసంవత్సరం బీటెక్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- మెషీన్ లెర్నింగ్, ఐవోటీ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, రొబోటిక్స్ అండ్ ఆటోమేషన్ వంటి స్పెషలైజేషన్ కోర్సులు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.


గీతం ప్రవేశపరీక్ష కోసం ఆన్‌లైన్ (www.gitam.edu) లో దరఖాస్తులను 2020 మార్చి 30వ తేదీలోగా పంపించాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 50 కేంద్రాల్లో 2020 ఏప్రిల్ 11 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలను నిర్వహిస్తామని, తుదిఫలితాలు ఏప్రిల్ 25న వెల్లడిస్తామని వివరించారు. పూర్తి వివరాలకు 08455-221266 లేదా 9542424256/59/66 ఫోన్‌నంబర్లను సంప్రదించాలని లేదా [email protected] ను బ్రౌజ్‌చేయాలని సూచించారు.

380
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles