మ్యాన్‌హోల్ తెరిచి ఉంటే సమాచారం ఇవ్వండి...

Sat,June 29, 2019 10:30 PM

హైదరాబాద్ : వర్షాకాల నేపథ్యంలో నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు జలమండలి ఎండీ దానకిశోర్ ఆదేశాలు జారీ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమీషరేట్ కార్యాలయంలో జలమండలి, జీహెచ్‌ఎంసీ, విద్యుత్, అగ్నిమాపక, పోలీస్, విద్యుత్ శాఖల అధికారులతో జలమండలి ఎండీ దానకిశోర్, సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ విసి సజ్జనార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జలమండలికి సంబంధించి ఎండీ దానకిశోర్ పలు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో వర్షాలు పడితే నీరు నిలిచే 195 ప్రాంతాలు, అందులో అధికంగా ఇబ్బందులు తలెత్తే 18 ప్రాంతాలను గుర్తించినట్లు ఎండీ తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వర్షం కురిసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మ్యాన్‌హోళ్లు తీయకూడదని, ఎక్కడైనా మ్యాన్‌హోల్ తెరిచి ఉంటే జలమండలి కస్టమర్ కేర్ నంబరు 155313కి డయల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రతి డీజీఎం పరిధిలోని అన్ని మ్యాన్‌హోళ్ల కవర్లను మరోసారి పరిశీలించాని ఎండీ ఆదేశించారు. ఈ సమావేశంలో జలమండలి డైరెక్టర్లు పీఎస్ సూర్యనారాయణ, అజ్మీరా కృష్ణ, పి. రవి, విజయ్‌కుమార్ రెడ్డిలతో పాటు సీజీఎం, జీఎంలు పాల్గొన్నారు.

717
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles