నేటి నుంచి దేవీశరన్నవరాత్రి మహోత్సవాలు

Sun,September 29, 2019 08:26 AM

హైదరాబాద్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ర్టంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర ఆలయంలో సరస్వతీ, మహాలక్ష్మీ, మహంకాళి అమ్మవార్లు ఉత్సవాలకు కొలువుదీరారు. ఈ ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు కొనసాగనున్నాయి. తొమ్మిది రోజులు రోజుకో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ముస్తాబైన ఇంద్రకీలాద్రి...
అమరావతి: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో వేడుకగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం దాదాపు రూ.7 కోట్లతో ఏర్పాట్లు చేసింది. ఏటా ఆశ్వయుజ మాసంలో జరిగే నవరాత్రి వేడుకలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవితో మొదలై అక్టోబర్ 8వ తేదీ వరకు ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఉదయం 9 గంటలకు స్నపనాభిషేకం అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. రెండోరోజు నుంచి తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనం కొనసాగుతుంది. అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం (అక్టోబర్ 5న) ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్ జగన్ పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు.

823
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles