అలవాట్ల కారణంగా గుండె జబ్బు

Thu,April 20, 2017 04:52 PM

good habits salve heart problems

నేటి తరం ఎక్కువగా బాధపడే ఆరోగ్య సమస్యల్లో గుండె సమస్య ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. నిత్యం తీసుకునే ఆహార అలవాట్లలో వస్తున్న మార్పులే దీనికి కారణం. ముంచుకొస్తున్న ముప్పు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా ఎవరికీ పట్టడంలేదు. పాశ్చాత్య పోకడల వైపు పరుగెడుతున్న నేటి యువతరం తమ అలవాట్ల కారణంగా గుండె జబ్బు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆడవారికన్నా ఎక్కువగా మగవారే గుండె జబ్బుల బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పడమే కాదు సర్వేలు కూడా కుండబద్దలు కొడుతున్నాయి. ఇందు కారణం గతంతో పోల్చితే మగవారికి శారీరక శ్రమ తగ్గిపోవడమే. మారుతున్న కాలంలో ఎక్కువ మంది మగవారు శారీరక శ్రమ లేకుండా తమ శరీరాన్ని సున్నితంగా పెంచేకోవడంతో పాటు ప్రమాదకరమైన గుండె సంబంధిత వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. సాధారణంగా కరోనరీ ఆర్టరీ డిసీజ్ వల్ల గుండె సంబంధ వ్యాధులు, హార్ట్‌ఎటాక్ సమస్యలు వస్తాయి. 50 శాతం హార్ట్ ఎటాక్‌లు అనుకోకుండా వచ్చేవే. ఎలాంటి వార్నింగ్ సంకేతం ఇవ్వకుండా ఈ ఎటాక్ వస్తుంది. గుండెలోని ఒక భాగానికి రక్తం సరఫరా కాకుండా బ్లాక్ అయినప్పుడు హార్ట్ ఎటాక్ వస్తుంది. అయితే ఈ హార్ట్ ఎటాక్‌ను కూడా కొన్ని పద్ధతుల ద్వారా నియంత్రించవచ్చు. కొన్ని అలవాట్లవల్ల హార్ట్ ఎటాక్ రిస్క్‌కి దూరంగా ఉండవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. డైట్‌లో, లైఫ్‌ైస్టెల్‌లో మార్పులు చేసుకోవడం వల్ల ప్రాణాంతకమైన హార్ట్ ఎటాక్‌ని అడ్డుకోవచ్చు. అంతేకాదు ఈ అలవాట్లు దాదాపు 80 శాతం హార్ట్ ఎటాక్ ముప్పుని అడ్డుకుంటాయని నిపుణులు చెప్తున్నారు. మరి హఠాత్తుగా వచ్చే హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం..

ఐదు అలవాట్లు...
ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, రోజుకు 40 నిమిషాలు వాకింగ్ లేదా వ్యాయామం, వారానికి కనీసం గంటసేపు వ్యాయామం. నడుము చుట్టుకొలత 95 సెంటీమీటర్లు దాటకుండా జాగ్రత్తపడటం. ఆల్కహాల్ తీసుకోవడం గణనీయంగా తగ్గించడం. పొగతాగే అలవాటుకు పూర్తిగా స్వస్తిచెప్పడం.

ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు...
టాన్సీఫ్యాట్ గురించి, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ గురించి చాలామందికి తెలియదు. ఇవి శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ కంటే చాలా డేంజరస్. ఆరోగ్యకరమైన శ్యాచురేటెడ్ ఫ్యాట్ కంటే లో ఫ్యాట్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. రిఫైన్డ్ షుగర్, ప్రాసెస్డ్ ప్రక్టోజ్‌లలో హానికారక ట్రాన్సీ ఫ్యాట్స్ ఉంటాయి. దీనివల్ల ఒబెసిటీ, గుండె సంబధిత వ్యాధిగ్రస్తులు పెరిగిపోతారు.

ఎక్కువ పండ్లు తీసుకోవాలి...
రెగ్యులర్‌గా పండ్లు తినేవాల్లలో40 శాతం గుండె సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఎక్కువ మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఉండే పండ్లు తినడం వల్ల ఎలాంటి అనారోగ్యసమస్యలు దరిచేరవు.

డయాబెటిస్ డ్రగ్స్ ప్రభావం...
కొన్ని రకాల డయాబెటిస్ మందులు థైరాయిడ్ గ్రంధిపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యలు, గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ పెరుగుతుంది. అలాగే టైప్ 2 డయాబెటిస్ నివారించడానికి తీసుకునే మందులు గుండె వ్యాధులు వచ్చే రిస్క్‌ను పెంచుతాయి.

హార్ట్‌ఎటాక్ రిస్క్ తగ్గించవచ్చు...
ఇటీవల పెరుగుతున్న హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గించుకోవడానికి ఒత్తిడికి దూరంగా ఉండాలి. రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి. వీలైనప్పుడల్లా చెప్పులు లేకుండా నడవాలి. బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించే మందులకు దూరంగా ఉండాలి. వీటివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. విటమిన్ సీ సరిగా అందేలా జాగ్రత్తపడాలి. రోజుకు మూడు గంటల కంటే ఎక్కువ సేపు కూర్చోకూడదు.

ఎలాంటి డైట్ తీసుకోవాలి ?
ప్రాసెస్ చేయబడిన ఆహారం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరాదు. హార్ట్ ఎటాక్ ముప్పు తగ్గించుకోవాలంటే రెస్టారెంట్ ఫుడ్ తీసుకోరాదు. షుగర్, ప్రాసెస్డ్ గ్రెయిన్స్, ప్రక్టోజ్‌కి దూరంగా ఉండాలి. పచ్చి ఆహార పదార్థాలు ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ మొత్తంలో పండ్లు, కూరగాయలు, మాంసం తీసుకోవాలి.

హెల్తీ ఫ్యాట్‌ను ఎలా పొందాలి?
కొబ్బరి, కొబ్బరి నూనె, అవకాడో, గుడ్డులోని పచ్చసొన, వెన్న, నట్స్, మాంసం, బాదం, పచ్చి పాల ఉత్పత్తుల ద్వారా హెల్తీ ఫ్యాట్ పొందవచ్చు. కాబట్టి వీటిలో ఏదో ఒకటి రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.


2715
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles