గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కును ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

Fri,November 1, 2019 12:01 PM

యాదాద్రి భువనగిరి : చౌటుప్పల్‌ మండలంలోని దండు మల్కాపూర్‌ వద్ద గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కును ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ప్రారంభించారు. గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు ప్రారంభోత్సవంలో భాగంగా పైలాన్‌ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. అక్కడ పరిశ్రమల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, దాదాపు 2 వేల మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

580
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles