వ్యవసాయ రంగంలో 8.1 శాతం వృద్ధిరేటు నమోదు

Mon,September 9, 2019 01:04 PM

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతికాముక విధానాల వల్ల అన్ని ప్రధాన రంగాల్లో గణనీయమైన వృద్ధిరేటు నమోదు అయిందని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా కేసీఆర్‌ ఈ విషయాలను వెల్లడించారు. వ్యవసాయ, దాని అనుబంధ శాఖలతో కూడిన ప్రాథమిక రంగంలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో 1.8 శాతం వృద్ధిరేటు మాత్రమే తెలంగాణలో నమోదైందన్నారు. గడిచిన ఐదేళ్లలో 6.3 శాతం అదనపు వృద్ధి సాధించి, 2018-19 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో 8.1 శాతం వృద్ధిరేటును నమోదు చేయగలిగిందని సీఎం తెలిపారు.


పారిశ్రామిక రంగంలో 5.8 శాతం వృద్ధి నమోదు
2013-14 ఆర్థిక సంవత్సరంలో 0.4 శాతం వృద్ధిరేటుతో ఉన్న పారిశ్రామిక రంగంలో కూడా అదనంగా 5.4 శాతం అదనపు వృద్ధి సాధించి, 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 5.8 శాతం వృద్ధిని తెలంగాణ రాష్ట్రం నమోదు చేసిందన్నారు.

లక్షా 10 వేల కోట్లకు చేరుకున్న ఐటీ ఎగుమతులు
ఇక ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, సేవారంగంలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో కేవలం 8.7 శాతం వృద్ధిరేటు నమోదైతే, 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మరో 2.8 అదనపు వృద్ధి సాధించి, మొత్తంగా 11.5 శాతం వృద్ధిరేటును సాధించింది అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఐటీ ఎగుమతుల విలువ రూ.52 వేల కోట్లు కాగా, 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి వంద శాతానికి పైగా పెరిగి, లక్షా 10 వేల కోట్ల రూపాయాలకు చేరుకోవడం తెలంగాణ సాధించిన అద్భుత విజయానికి సంకేతమని సీఎం స్పష్టం చేశారు.

651
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles