తుమ్మిళ్లకు అడ్డుపడ్డ చంద్రబాబును తరిమికొట్టాలి : హరీష్ రావు

Tue,December 4, 2018 01:39 PM

జోగులాంబ గద్వాల : అలంపూర్ నియోజకవర్గంలోని తుమ్మిళ్ల ప్రాజెక్టుకు అడ్డుపడ్డ చంద్రబాబును తరిమికొట్టాలని సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. అలంపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన టీ ఆర్ ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. కొంతమంది తెలంగాణ వస్తే ఏమొస్తది అన్నారు. తెలంగాణ వస్తే తుమ్మిళ్ల లిఫ్ట్ వస్తది. ఎండిపోయిన ఆర్డీఎస్ కాల్వల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కేసీఆర్ సీఎం కాకపోతే తుమ్మిళ్ల లిఫ్ట్ వచ్చేదా? ఆర్డీఎస్ కాల్వల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కేదా? అని హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అంటే కమీషన్లు, కాలయాపన.. ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చిన చరిత్ర కాంగ్రెస్ ది. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 8 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చాం. పది నెలల్లోనే తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా నీళ్లిచ్చిన చరిత్ర కేసీఆర్ ది.


చంద్రబాబు తుమ్మిళ్లకు అడ్డుపడ్డాడు. ఇది అక్రమ ప్రాజెక్టు అని కేంద్రానికి లేఖ రాసిండు. తుమ్మిళ్ల వద్దన్న చంద్రబాబును తరిమికొట్టాలి. చంద్రబాబును అధికారంలోకి తెస్తే మన కంటిని మన వేలితో మనం పొడుచుకున్నట్లే. తుంగభద్ర నుంచి 40 టీఎంసీల నీటిని తీసుకుపోయేందుకు, నాగల్ దిన్నె లిఫ్ట్ ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుండు. సుంకేశులకు నీళ్లు రాకపోతే తుమ్మిళ్లకు నీళ్లు రావు. నాగల్ దిన్నె లిఫ్ట్ ఆగాలంటే చంద్రబాబును ఓడగొట్టాలి.

మహాకూటమిలో ఉత్తమ్ ఉనికి పోయింది. మహాకూటమి తెరపై కనబడుతున్నది చంద్రబాబు, బాలకృష్ణ మాత్రమే. చంద్రబాబు ముఖంలో చంద్రముఖి కనబడుతున్నది. ఈ చంద్రముఖి మాకొద్దని తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఈ జిల్లాను దత్తత తీసుకున్న చంద్రబాబు మనకు మాటలు చెప్పి.. నీళ్లను ఏపీకి తీసుకుపోయిండు. ఇవాళ నీళ్లు వస్తున్నాయంటే కేవలం సీఎం కేసీఆర్ వల్లనే. నీళ్లిచ్చిన కేసీఆర్ కే ఓటేస్తామని మానవపాడు, ఉండవల్లి, అలంపూర్ రైతాంగం ప్రతిన బూనుతున్నారని హరీష్ రావు తెలిపారు.

1587
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles