భద్రకాళి బండ్ తరహాలో సిద్దిపేటలో అభివృద్ది: హరీశ్‌రావు

Tue,August 13, 2019 09:42 PM

harish rao visit bhadrakali temple tank bund warangal

వరంగల్ : చారిత్రక వరంగల్ నగరంలోని భద్రకాళి దేవాలయం పక్కన భధ్రకాళి బండ్ అభివృద్ధి అద్బుతంగా ఉంది. ఇదే తరహాలో తన నియోజవర్గంలో బండ్ అభివృద్ధికి శ్రీకారం చుడుతాను.. అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆయన వరంగల్‌లోని భద్రకాళి బండ్‌ను సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. బండ్‌పై చేస్తున్న అభివృద్ధిని జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ వివరించారు. 1.1 కిలోమీటర్లు మేరకు అభివృద్ధి చేస్తున్నామని , రెండో దశలో మరో 1.5 కిలోమీటర్ల బండ్‌ను అభివృద్ది చేస్తామని ఆయన వివరించారు.

వరంగల్‌లోని భద్రకాళి బండ్ చూపి సిద్దిపేటలో బండ్ అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఇక్కడికొచ్చానని హరీశ్‌రావు తెలిపారు. భద్రకాళి బండ్ అభివృద్ధి అద్బుతంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొదటి సారిగా భద్రకాళి బండ్‌పై సింథటిక్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారని అన్నారు. ఇదే తరహలో సిద్దిపేటలో ఏర్పాటు చేస్తానని అన్నారు. కాకతీయుల కళా సంస్కృతి ఉట్టిపడేలా బండ్‌పై ఆర్చీల నిర్మాణం ఎంతో బాగుందని అన్నారు. సహజసిద్దమైన అందాలు ఉన్న భద్రకాళి బండ్ వరంగల్ ప్రజలకు వరమని ఆయన పేర్కొన్నారు.

బండ్ ప్రారంభం అయ్యాక సెలవు రోజులలో పర్యాటకులను ఆకట్టుకుంటుందని అన్నారు. భధ్రకాళి చెరువులో వాటర్‌ఫౌంటేన్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా బండ్‌పై పార్క్‌ను ఏర్పాటు చేసి ఆక్సిజన్ మొక్కలు పెంచాలని సూచించారు. వరంగల్ నగరానికి భద్రకాళి బండ్ ఐకాన్‌గా నిలుస్తుందని ఆయన అన్నారు. భద్రకాళి బండ్ అభివృద్దిలో నిరంతరం కష్టపడుతున్న ప్రజాప్రతిధులు, అధికారలను ఆయన అభినందించారు. హరీశ్‌రావు వెంట కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, కుడాచైర్మన్ మర్రి యాదవరెడ్డి, వరంగల్ నగర డిప్యూటి మేయర్ ఖాజాసిరాజుద్దీన్, కార్పొరేటర్ చింతల యాదగిరి, కమిషనర్ రవికిరణ్, కుడా ప్లానింగ్ అధికారి అజిత్‌రెడ్డి, ఈఈ భీమ్‌రావు ఉన్నారు.

1011
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles