కందుల దిగుమతి నిలిపివేసేలా కేంద్రానికి ‌లేఖ: హరీశ్ రావు

Mon,June 18, 2018 07:27 PM

Harishrao Review with Marketing officers

హైదరాబాద్ : మార్కెట్ శాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు బీఆర్ కే భవన్ లో సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటలకు కనీస మద్దతు ధరల చెల్లింపు, గోదాముల నిర్మాణం వంటి అంశాలపై అధికారులతో సమీక్షించారు. సమీక్షలో హరీశ్ రావు మాట్లాడుతూ..రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి, మొక్క జొన్న, జొన్న వంటి పంటల మద్థతు ధరలను ప్రభుత్వం వెంటనే చెల్లిస్తోందన్నారు. రైతుల నుంచి రూ.5618 కోట్ల విలువైన వడ్లను కొనుగోలు చేసి, రైతులకు మొత్తం చెల్లింపులు చేసినట్లు మంత్రి వెల్లడించారు. కందులను రూ.1427 కోట్లతో కొని, రైతులకు రూ.1420 కోట్లు చెల్లింపులు చేశామన్నారు. మిగిలిన 7.33 కోట్లు రెండు రోజుల్లో చెల్లించాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో రైతుల నుంచి శనగలు రూ.294 కోట్లతో కొనుగోలు చేస్తే 265 కోట్లు చెల్లింపులు జరిగాయని, మిగిలిన రూ.౩౦ కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ మిగిలిన మొత్తాన్ని రెండు రోజుల్లో రైతులకు చెల్లించాలని నాఫెడ్, మార్క్ ఫెడ్ అధికారులను హరీశ్ రావు ఆదేశించారు. మొక్కజొన్న రూ.629 కోట్లతో రైతుల నుంచి కొనుగోలు చేసి, రూ.611 కోట్లు చెల్లింపులు చేశామని తెలిపారు. మిగిలిన రూ.18 కోట్లు రెండు, మూడు రోజుల్లో చెల్లించాలని అధికారులకు నిర్దేశించారు. కందులకు రూ.7.33 కోట్లు, శనగలకు రూ.3.37 కోట్లు, మినుములకు రూ. 9.91 కోట్లు, జొన్నలకు రూ. 6.21 కోట్లు మార్క్ ఫెడ్ నుంచి రావాల్సి ఉండగా.. మంత్రి హరీష్ రావు మార్క్ ఫెడ్ అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే ఆ మొత్తాన్ని విడుదల చేయాలని ఆదేశించారు.

కందులను కేంద్రం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుందని, రాష్ట్రంలో కొన్నకందులను మార్కెట్ లోకి విడుదల చేయాల్సి ఉందని హరీశ్ రావు అన్నారు. ఇతర రాష్ట్రాల్లోను కందులు ఉన్నాయి. అవి మార్కెట్లోకి పూర్తిగా విడుదల చేశాకే ఇతర దేశాల నుంచి కందులు దిగుమతి చేయాల్సి ఉందని చెప్పారు. ఇదే విషయాన్ని వివరిస్తూ కేంద్రానికి లేఖ రాయాలని అధికారులను హరీశ్ రావు ఆదేశించారు. 322 గోదాములు మంజూరైతే 320 గోదాములు పూర్తయ్యాయి. మిగిలిన 2 గోదాముల నిర్మాణానికి స్థల సేకరణ సమస్య ఉందని అధికారులు చెప్పగా..ఆ సమస్యను పరిష్కరించి, రీ టెండర్లు పిలిచి వెంటనే రెండు గోదాముల నిర్మాణం పూర్తి చేయాలని హరీశ్ రావు ఆదేశించారు.

2157
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles