జ్వరాల నివారణకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు

Mon,September 16, 2019 06:35 AM


హైదరాబాద్ : గ్రేటర్‌లో జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో జ్వరా ల నివారణకు విస్తృత చర్యలు చేపడుతోంది. బస్తీ దవాఖాన దగ్గర నుంచి సాయంకాలం దవాఖాన వరకు ప్రతి ఆరోగ్య కేంద్రం ద్వారా రోగులకు వైద్యసేవలు అందిస్తోంది. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 85ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలతోపాటు 64 బస్తీ దవాఖానలు, సాయంకాలం క్లీనిక్‌లతోపాటు ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌, నల్లకుంట ఫీవర్‌ హాస్పిటల్‌ తదితర దవాఖానల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి జ్వరపీడితులకు వైద్యం అందిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతోపాటు ప్రజల ఇండ్ల వద్దకే వెళ్లి సేవలు అందిచే క్రమంలో ఔట్‌ రీచ్డ్‌ హెల్త్‌ క్యాంప్స్‌ను సైతం నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.వెంకటి స్పష్టం చేశారు. ఎక్కువ కేసులు నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక వైద్యశిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


అన్ని దవాఖానలు, ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ సమయాన్ని సైతం ఉదయం నుంచి రాత్రి వరకు రెండు షిఫ్టులో కొనసాగిస్తున్నారు. ఉస్మానియా, గాంధీ వంటి టీచింగ్‌ హాస్పిటల్స్‌లో ఉదయం ఓపీని మధ్యాహ్నం 2 గంటల వరకు తిరిగి సాయంత్రం 4నుంచి రాత్రి 7గంటల వరకు కొనసాగిస్తున్నారు. ఆదివారాలతోపాటు అన్ని పబ్లిక్‌ హాలిడేస్‌ల్లో కూడా ప్రభుత్వ దవాఖానల్లో ఓపీ సేవలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన రక్తనమూనాలను సేకరిస్తున్నారు. ఉస్మానియా, గాంధీ, ఫీవర్‌ హాస్పిటల్స్‌ వంటి దవాఖానల్లో డెంగీ నిర్ధారణ పరీక్షల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. జ్వరపీడితులు ఉన్న ప్రాంతాల్లో ముందుజాగ్రత చర్యగా ప్రివెంటివ్‌ మెడిసిన్స్‌ అందిస్తున్నట్లు ఆయా జిల్లాల వైద్యాధికారులు తెలిపారు.

590
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles