జూరాల 33 గేట్లు ఎత్తివేత

Wed,October 23, 2019 03:33 PM

జోగులాంబ గద్వాల: ఎగువ నుంచి వరద ప్రవాహాలు భారీగా పెరగడంతో అధికారులు జూరాల ప్రాజెక్ట్‌ 33 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఆల్మట్టి డ్యాం గేట్ల ద్వారా 2,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మరోవైపు నారాయణపూర్‌ డ్యాం 23 గేట్ల నుంచి 3,17,256 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో జూరాలకు వరద పోటెత్తింది. కుడి, ఎడమ కాల్వలకు అదేవిధంగా నెట్టెంపాడుకు అధికారులు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద ఉదృతిని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు మరిన్ని గేట్లు తెరిచే అవకాశం ఉంది.

1090
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles