హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం

Sun,October 20, 2019 02:31 PM


హైదరాబాద్ : హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, ఆసిఫ్ నగర్, లక్డీకపూల్, అమీర్ పేట్, మాసబ్ ట్యాంక్ తోపాటు వివిధ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడ్డది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. పలు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ రాకపోకలకు ఆంతరాయం ఏర్పడింది. రానున్న 5 రోజులు వర్షాలు కురిసే అవకాశముండగా..కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఉపరితల ద్రోణి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

2307
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles