నిప్పుల కొలిమిలా జగిత్యాల.. గరిష్ఠ ఉష్ణోగ్రత 47.7 డిగ్రీలు

Sun,May 26, 2019 10:07 PM

heavy temperature in jagtial

జగిత్యాల: భానుడి ఉగ్ర రూపానికి జగిత్యాల జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. మే నెల చివరి వారంతో పాటు రోహిణి కార్తే రావడంతో ఎండలు దంచి కొడుతున్నాయి. గత రెండు రోజులుగా రాష్ట్ర స్థాయిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు జగిత్యాల జిల్లాలోనే నమోదవుతున్నాయి. ఉదయం నుంచే సెగలు పుడుతుండడంతో అత్యవసరమయితే తప్ప ప్రజలు రోడ్డెక్కడం లేదు.

జిల్లాలో ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 47.7గా నమోదైంది. వెల్గటూర్ మండలం ఎండపల్లి, రాజారాంపల్లి, ధర్మపురి మండల కేంద్రంలో 47.7 డిగ్రీలు, జైనలో 47.6, మేడిపల్లిలో 47.5, బీర్పూర్ మండలం కొల్వాయిలో 47.4, జగిత్యాల మండలం పొలాసలో 47.4, సారంగాపూర్ మండలం, ఇబ్రహీంపట్నం మండలం గోదూర్‌లో 47.4, మెట్‌పల్లిలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

1822
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles