పిడుగు నుంచి కాపాడిన హెల్మెట్

Thu,March 21, 2019 06:28 AM

మెదక్ : రోడ్డు ప్రమాదాల నుంచి ద్విచక్రవాహనదారులను కాపాడే హెల్మెట్ ఓ వ్యక్తి ని పిడుగుపాటు నుంచి కాపాడింది. ఈ ఘటన మెదక్ పట్టణ శివారులో జరిగింది. వెల్దుర్తి మండలం రామాయిపల్లికి చెందిన నర్సింహులు, మెదక్ మండలం మల్కాపూర్ తండాకు చెందిన గోపాల్, పిర్యా ద్విచక్రవాహనంపై మల్కపూర్ తండాకు బయలుదేరారు. మెదక్ శివారులోని బంగ్లా చెరువు కట్టపైకి చేరుకోగానే వర్షం రావడంతో చెట్టు కింద నిల్చున్నారు. అదే సమయంలో హెల్మెట్ పెట్టుకొన్న నర్సింహులు తలపై పిడుగుపడింది.దీంతో గాయాలతో స్పృహ కోల్పోయాడు. గోపాల్, పిర్యాలకు సైతం స్వల్ప గాయాలయ్యాయి. నర్సింహులు గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నది.

4616
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles