బతికున్న నాగుపామును మింగేసిన కోడి పుంజు

Thu,August 1, 2019 01:45 PM

మెదక్ : నాగుపామును చూడగానే వణికిపోతారు.. అక్కడ్నుంచి పరుగెడుతారు.. కానీ ఓ కోడి పుంజు మాత్రం నాగుపాముపై దాడి చేసి దాన్ని అమాంతం మింగేసింది. ఈ సంఘటన మెదక్ జిల్లాలోని శివంపేట మండలం శభాష్‌పల్లిలో వెలుగు చూసింది. నాలుగైదు కోళ్లు ఓ నాగుపామును చూశాయి. దీంతో ఆ పాము పడగ విప్పుతూ.. బుసల కొడుతూ కోళ్లపై దాడి చేసింది. కోళ్లు కూడా అదే స్థాయిలో పాముపై దాడి చేశాయి. చేసేదిమీ లేక ఆ సర్పం అటు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేసింది. కానీ ఓ పుంజు మాత్రం నాగుపాముపై దాడి చేసి.. దాన్ని అమాంతం మింగేసింది. ఈ విచిత్ర సంఘటనను చూసిన స్థానికులు నోరెళ్లబెట్టారు. పామును మింగిన కోడి పుంజుకు ఏమవుతుందో అని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.

5105
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles