రూ. 3,800తో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు

Sun,July 21, 2019 08:40 AM

Hotel management course with RS.3,800

హైదరాబాద్: ఏడాదికి రూ.3,800 ఫీజుతో మూడేండ్ల హోటల్ మే నేజ్‌మెంట్ కోర్సును పూర్తిచేసుకుంటే ఈ రంగంలో మంచి ఉద్యోగాలు సాధించవచ్చని కమలానెహ్రూ పాలిటెక్నిక్ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ అనిల్‌కుమార్ తెలిపారు. 30 సీట్లున్న ఈ కోర్సులో మహిళలకే అవకాశం ఉన్నదని, ఇంటర్ (అన్ని గ్రూపులు) అర్హతతో ఈ కోర్సును పూర్తిచేసిన మహిళలు ఐసెట్ రాసి ఎంబీఏ చదువుకోచ్చని అ న్నారు. స్కాలర్‌షిప్‌కు అర్హత ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఫీజులో రాయితీతో పాటు ఉచితంగా హాస్టల్ వసతి కూడా ఉన్నదని, దోస్త్‌లో ఆన్‌లైన్‌ద్వారా దరఖా స్తు చేసుకునేందుకు ఆదివారం చివరితేదీ అని తెలిపారు. వివరాలకు 7337097378, 9030862760, 8187010928 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.

528
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles