బాలింతపై భర్త, అత్తమామల దాడి

Mon,September 16, 2019 09:18 PM

జగిత్యాల : జిల్లాలోని కోరుట్లలో దారుణం జరిగింది. బాలింత అనే కనికరం కూడా లేకుండా అత్తింటివారు కోడలిపై మూకుమ్మడిగా దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కోరుట్లలోని ప్రకాశం రోడ్డు ప్రాంతానికి చెందిన ముదిగొండ రంజిత్‌తో 14 నెలల క్రితం జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన బాస గంగాధర్ - కాంత దంపతుల కూతురు మౌనికతో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కట్న కానుకల కింద రూ. 5లక్షలు అందజేశారు. 40 రోజుల క్రితం పండంటి బాబుకు మౌనిక జన్మనిచ్చింది. గత కొద్ది రోజుల నుంచి మరింత కట్నం తేవాలని అత్తింటి వారి వేధింపులు మౌనికకు అధికమయ్యాయి. దీంతో ఆమె తల్లిగారింట్లోనే ఉంటోంది.


అయితే సోమవారం తనకు సంబంధించిన సర్టిఫికెట్స్ తీసుకునేందుకు అత్తగారింటికి వచ్చింది మౌనిక. దీంతో రెచ్చిపోయిన భర్త రంజిత్ భార్య మౌనికపై విచక్షణరహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. కొడుకుకు వత్తాసు పలుకుతూ అత్త గంగలక్ష్మీ, మామ రాజేశం కూడా దాడి చేశారని మౌనిక ఆరోపించింది. తనను ఇంట్లోకి రానివ్వకుండా రోడ్డుపైకి తరిమి తరిమి కొట్టారని రోదిస్తూ తెలిపింది. ఒంటరిగా వెళ్లడంతోనే బతికి పోయాననీ, తన కొడకును తీసుకుని పోతే బాబును లాక్కొని చంపేశావారని కన్నీరుమున్నీరయింది. తీవ్రంగా గాయపడ్డ మౌనికను అంబులెన్స్‌లో జగిత్యాల ప్రభుత్వానికి తరలించారు. బాధితురాలు మౌనిక జగిత్యాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

2734
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles