విజయారెడ్డి హత్య అత్యంత దారుణం : సోమేశ్‌ కుమార్‌

Tue,November 5, 2019 01:08 PM

హైదరాబాద్‌ : అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్యను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఖండించారు. అత్యంత దారుణమైన ఘటనను అందరం ఖండించాలని రెవెన్యూ ఉద్యోగులకు సోమేశ్‌ కుమార్‌ సూచించారు. ఈ క్రమంలో కలెక్టర్లకు సోమేశ్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. అధికారుల భద్రతకు ప్రభుత్వం, మనం అన్ని రకాల చర్యలు తీసుకుందామన్నారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలతో కలెక్టర్లు మాట్లాడి వాళ్లకు భరోసానివ్వాలి. అధికారులకు, ఉద్యోగులకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించేలా చూడాలి అని కలెక్టర్లకు సోమేశ్‌ కుమార్‌ సూచించారు.

1317
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles