విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలి..

Thu,November 7, 2019 08:44 AM

హైదరాబాద్: రాష్ట్రంలో విద్యాప్రమాణాలు మెరుగుపర్చాలని కోరుతూ రాష్ట్ర విద్యార్థుల తల్లుల సంఘం, బాలల హక్కుల పరిరక్షణ వేదిక, విద్యాసామర్థ్యాల సాధన సమితి ఆధ్వర్యంలో ఆయా సంస్థల ప్రతినిధులు బుధవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆమె నివాసంలో కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. దేశంలో ప్రస్తుతం పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో.. అధిక శాతం విద్యార్థులకు కనీస నైపుణ్యాలు, గణిత సామర్థ్ధ్యం లేదని, చక్కటి విద్యాప్రమాణాలు వారికి అందుబాటులో లేవని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇవే విషయాలను జాతీయస్థాయిలో అనేక నివేదికలు స్పష్టం చేశాయని గుర్తు చేశారు. అయితే రాష్ట్రంలో పరిస్థితులు కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేవనీ, ఈ విషయాలను జాతీయస్థాయిలో నిర్వహించిన సర్వే నివేదికలు బలపరుస్తున్నాయని, ఇటువంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని దీనిని విద్యా వెనుకబాటు తనంగా గుర్తించాల్పిన పరిస్థితి ఉందన్నారు. నిర్దేశించిన స్థాయిలో పాఠశాలలో విద్యాప్రమాణాలు పిల్లలకు చేరకపోతే సామాజిక అసమానతలకు దారితీస్తుందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని, ఈ విషయంలో ప్రభుత్వం పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు కృషిచేయాలని వారు మంత్రిని కోరారు.

369
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles