యువతిపై పగ..ఫేస్‌బుక్‌లో ఫొటోలు

Sun,May 26, 2019 08:02 AM

indecent writings in facebook

హైదరాబాద్ : ప్రేమను నిరాకరించడంతోపాటు వాట్సాప్ గ్రూపులో పెట్టిన పోస్టింగ్‌లు తొలగిస్తుండడంతో.. యువతిపై పగ పెంచుకుని, ఫేస్‌బుక్‌లో ఆమెపై అసభ్యకరమైన రాతలు పెట్టిన ఓ యువకుడు జైలుపాలయ్యా డు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్ క్రైం పోలీసులు నిందితుడు నవీన్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. సైబర్ క్రైం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా నిజాంపేట్ ఆదిత్యనగర్ ప్రాంతానికి చెందిన నర్సింగం నవీన్‌కుమార్ సన్ డయాగ్నస్టిక్ కేంద్రంలో రిపోర్టింగ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. ఇతను ఖమ్మం కొత్తగూడెంలోని జేవీఎస్ చైతన్య కాలేజీ లో చదివాడు.

ఆ సమయంలో చదివిన విద్యార్థులు ఇటీవల జేవీఎస్ బీపీఎస్ పేరుతో వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేశారు. ఈ గ్రూపుకు సాయి పవన్, బాధితురాలు అడ్మినిస్ట్రేటర్‌లుగా ఉన్నారు. ఆ గ్రూపులో నవీన్‌కుమార్ కూడా సభ్యుడిగా ఉన్నాడు. అయితే గ్రూపునకు అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న యువతిని నవీన్‌కుమార్ ప్రేమించాడు. అయితే యువతి అతని ప్రతిపాదనకు స్పందించలేదు. దీనికితోడు నవీన్‌కుమార్ వాట్సాప్ గ్రూపులో పెడుతున్న పోస్టింగ్‌లను యువతి తొలగిస్తుండడంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. యువతి పరువు తీసేందుకు నవీన్‌కుమార్ ఫేస్‌బుక్‌లో ఓ ఖాతాను తెరిచి... అందులో యువతి ఫొటోలు పెట్టి అసభ్యకరమైన రీతిలో రాతలు పెట్టాడు.

అంతేకాకుండా యువతితో వీడియో కాల్‌లో సెక్స్ చాట్‌కు రూ.400, నగ్నంగా వీడియో కాల్‌లో మాట్లాడాలంటే రూ.1500 చెల్లించాలని పోస్టింగ్ పెట్టాడు. ఈ కాల్స్‌తో ఎంజాయ్ చేయాలనుకునే వారు ఫోన్ పే, ఎస్‌బీఐ ఖాతాలో నగదును జమ చేయాలని కూడా ఖాతా నంబర్లు పెట్టాడు. ఈ విధంగా యువతి ప్రతిష్టకు భంగం కలిగిస్తూ డబ్బులు కూడా వసూలు చేయడం, చాలా మంది యువతికి ఫోన్ చేస్తుండడంతో ఆమె సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు శనివారం నవీన్‌కుమార్‌ను రాజేంద్రనగర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. అతని నుంచి యువతి గురించి అభ్యంతకరంగా పోస్టింగ్‌లు పెట్టిన స్మార్ట్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

5043
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles