కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై దేశీయ మీడియాలో ప్ర‌శంస‌లు

Sat,June 22, 2019 11:47 AM

హైద‌రాబాద్: అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క కాళేశ్వ‌రం ప్రాజెక్టును శుక్ర‌వారం సీఎం కేసీఆర్ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఆ అద్భుత ఘ‌ట్టాన్ని దేశీయ మీడియా విశేషంగా కొనియాడింది. భారీ లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ అతి స్వ‌ల్ప స‌మ‌యంలోనే పూర్తి చేశార‌ని మెచ్చుకున్నాయి. 88వేల కోట్ల‌తో ప్రాజెక్టును పూర్తి చేసిన‌ట్లు హిందీ ప‌త్రిక దైనిక్ భాస్క‌ర్ త‌న క‌థ‌నంలో పేర్కొన్న‌ది. మ‌రో హిందీ ప‌త్రిక దైనిక్ జాగ‌ర‌న్ కూడా కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వాన్ని త‌న శీర్షిక‌లో పేర్కొన్న‌ది. ప్ర‌పంచంలోనే అత్యంత పెద్ద లిఫ్ట్ ఇరిగేష‌న్ స్కీమ్‌ను తెలంగాణ‌లో ప్రారంభించిన‌ట్లు ఆ ప‌త్రిక త‌న క‌థ‌నంలో వెల్ల‌డించింది. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు కేంద్రం త‌న స‌హ‌కారాన్ని అందిస్తే బాగుంటుంద‌ని లోక్‌మ‌త్ టైమ్స్ త‌న క‌థ‌నంలో పేర్కొన్న‌ది. కోల్‌క‌తాకు చెందిన స్టేట్స్‌మెన్ దిన ప‌త్రిక కూడా కాళేశ్వ‌రం ప్రాజెక్టు ఓపెనింగ్ గురించిన ప్ర‌స్తావించింది. దేశ చ‌రిత్ర‌లో ఇది కొత్త అధ్యాయం అని పేర్కొన్న‌ది. కాళేశ్వ‌రం ఎత్తిపోతల ప‌థ‌కంతో తెలంగాణ స‌స్య‌శ్యామ‌లం అవుతుంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఉత్త‌రాది, ద‌క్షిణాది ప‌త్రిక‌లు కూడా ఇదే అంశాన్ని ఘోషించాయి.3350
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles