వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ

Sun,August 18, 2019 07:11 PM

Indrakaran lays foundation stone to venkateshwara swamy temple


నిర్మల్ : నిర్మల్ రూరల్ మండలం అనంతపేట్ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మంత్రి మొక్కలు నాటారు. కామన్ గుడ్ ఫండ్ నుంచి ఆలయ నిర్మాణానికి రూ.34 లక్షలు మంజూరు చేశారు.

ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా జడ్పి చైర్మన్ విజయ రాంకిషన్ రెడ్డి, జిల్లా ఎస్పీ శశిధర్ రాజు, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ గౌడ్, రాంకిషన్ రెడ్డి, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు అశోక్, విలాస్, తదితరులు పాల్గొన్నారు.

1394
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles