పాలజ్ క‌ర్ర గణపతిని ద‌ర్శించుకున్న మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్

Thu,September 12, 2019 12:06 PM

Indrakaran visits palajkarra ganesh temple in maharashtra


మహారాష్ట్ర : మ‌హారాష్ట్ర‌లోని పాల‌జ్ క‌ర్ర గ‌ణ‌ప‌తిని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి దంప‌తులు ద‌ర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆల‌య క‌మిటీ స‌భ్యులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి దంప‌తులకు ఘనస్వాగతం పలికారు. స్వామివారి స‌న్నిధిలో మంత్రి ఇంద్రకరణ్ కుటుంబ స‌మేతంగా ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. పూజ అనంత‌రం ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు. ఆల‌య క‌మిటీ స‌భ్యులు ఇంద్రకరణ్ కుటుంబ స‌భ్యుల‌ను స‌త్క‌రించారు. మంత్రి వెంట ముధోల్ ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి, జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ విజ‌య‌ల‌క్ష్మి, త‌దిత‌రులున్నారు.


486
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles