అన్ని రంగాల్లో పురోగమిస్తున్న జనగామ : మంత్రి ఎర్రబెల్లి

Tue,November 5, 2019 02:31 PM

జనగామ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనగామ జిల్లా అన్ని రంగాల్లో పురోగమిస్తోందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. జనగామ జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో జనగామ వెనుకబాటు తనంలో ఉండేది. ఇప్పుడు అన్ని రకాలుగా ముందంజలో ఉందన్నారు. అన్ని గ్రామాలకు తాగు, సాగునీరు అందిస్తున్న మహానుభావుడు సీఎం కేసీఆర్‌ అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ పట్టుదలతో గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. సర్పంచులు పట్టుదలతో పని చేసి గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలి. పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత సర్పంచ్‌, అధికారులపై ఉందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌.

1223
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles