జనసేనను వీడట్లేదు: జేడీ లక్ష్మీనారాయణ

Sat,August 10, 2019 06:15 PM

jd laxminarayana condemned party change rumors

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల తరువాత పార్టీకి దూరంగా ఉంటున్నాడన్న వార్తలను జేడీ లక్ష్మీనారాయణ ఖండించారు. మాజీ సీబీఐ డైరెక్టర్‌ జేడీ లక్ష్మీనారాయణ ఎన్నికలకు ముందు తన ఉద్యోగానికి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరి విశాఖపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా బీజేపీతో మంతనాలు జరుగుతున్నాయని, లక్ష్మీనారాయణ బీజేపీలో చేరుతారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాన్ని ఆయన ఈ రోజు ఖండించారు. పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.

926
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles