వరద కాలువకు చేరిన కాళేశ్వరం నీళ్లు...

Wed,August 14, 2019 05:17 PM

కరీంనగర్‌: లక్ష్మీపూర్‌ వద్ద గాయత్రి పంప్‌హౌస్‌ మోటర్లను ఈ రోజు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ట్రయల్‌ రన్‌తో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకం వరద కాలువలోకి నీరు చేరింది. జగిత్యాల జిల్లా రాంపూర్‌ వద్దకు బ్యాక్‌ వాటర్‌ చేరుకుంది. ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ అయ్యి వరద కాలువలోకి నీరు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల వద్ద రైతులు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా కొనసాగుతున్న రాంపూర్, రాజేశ్వర్‌రావుపేట పంపుహౌస్‌ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించేందుకు సీఎం మూడునాలుగు రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నదని అధికారులు పేర్కొన్నారు. ఇదే సమయంలో రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంపుహౌస్‌లో ఇప్పటికే వెట్ ట్రయల్‌ రన్‌ చేసిన పంపుల పనితీరును కూడా పరిశీలించే అవకాశం ఉన్నదని వెల్లడించారు.

4825
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles