కాళేశ్వరం ప్రాజెక్టు వెట్‌ రన్‌ విజయవంతం

Wed,April 24, 2019 12:33 PM

Kaleshwaram Project Wet Run Successful

హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలకఘట్టం ఆవిష్కృతం అయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన భారీ మోటర్లలో మొదటి మోటర్‌ వెట్‌ రన్‌ విజయవంతంగా ప్రారంభమైంది. సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌ పూజలు నిర్వహించి స్విచ్ఛాన్‌ చేసి వెట్‌ రన్‌ను ప్రారంభించారు. నందిమేడారం సర్జ్‌పూల్‌ నుంచి మోటార్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. సర్జ్‌పూల్‌ నుంచి ఈ నీళ్లు నందిమేడారం రిజర్వాయర్‌కు చేరనున్నాయి. అక్కడి నుంచి గోదావరి జలాలు లక్ష్మీపూర్‌ సర్జ్‌పూల్‌కు చేరనున్నాయి. లక్ష్మీపూర్‌ నుంచి ఎత్తిపోతల ద్వారా నీళ్లు మిడ్‌మానేరుకు చేరుకోనున్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బరాజ్ మొదలు అనేక జిల్లాల్లో దాదాపు 151 టీఎంసీలకుపైగా గోదావరి జలాలను రిజర్వాయర్లకు తరలించి నిల్వచేసేందుకు మొత్తం 82 మోటర్లను ఏర్పాటుచేస్తున్నారు. కనిష్ఠంగా 2.66 మెగావాట్లు మొ దలు 26, 40, 106.. ఇలా ఆసియాలోనే అత్యధిక సామర్థ్యం ఉన్న.. బాహుబలిగా పిలిచే 139 మెగావాట్ల మోటరును కూడా ఇందుకోసం వినియోగిస్తున్నారు. వీటి ఏర్పా ట్లు వివిధదశల్లో ఉన్నాయి. నంది మేడారం పంపుహౌజ్‌లో 124.4 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్లను అమరుస్తున్నారు. ఏడింటికిగాను నాలుగు డ్రైరన్ పూర్తి చేసుకొని, వెట్‌ రన్‌ కు సిద్ధంగా ఉన్నాయి. నాలిగింటిలో ఇవాళ ఒకటి వెట్‌రన్‌ విజయవంతమయింది. మిగతా మూడు రేపట్నుంచి వరుసగా వెట్‌రన్‌ ప్రారంభించనున్నారు.

ఉప్పొంగిన కాళేశ్వర గంగ.. వీడియో


వెట్‌ రన్‌ ఎలా?
ఎల్లంపల్లి జలాశయం నుంచి విడుదల చేసిన నీటితో నందిమేడారం పంపుహౌజ్‌లోని సర్జ్‌పూల్‌లో మంగళవారం రాత్రి సమయానికి 142.30 మీటర్ల మేర నింపారు. సోమవారం రాత్రి మొదటి మోటరుకు సంబంధించిన డ్రాఫ్ట్‌ట్యూబ్ గేట్‌ను ఎత్తిన అధికారులు.. మంగళవారం రాత్రి రెండో మోటరు డ్రాఫ్ట్‌ట్యూబ్ గేటును కూడా ఎత్తారు. బుధవారం ఉదయం వెట్‌ రన్‌ లో భాగంగా మొదటి మోటరును ఆన్‌చేయగానే పంపులు డిజైన్‌స్థాయి వేగానికి (ఆర్పీఎం- రెవల్యూషన్స్ పర్ మినిట్) తిరుగుతున్నయా? అనే అంశాన్ని పరిశీలించనున్నారు. ఆ తర్వాత మోటరులోని ఇంపుల్లర్‌లోకి నీటిని పంపేందుకుగాను బటర్‌ఫ్లై వాల్వ్ తెరుచుకుంటుంది. దీంతో ఇంపుల్లర్ వేగంగా తిరుగడంతో అందులోకి చేరిన నీటిని ఎత్తిపోస్తుంది.

ఆ నీరు 340 మీటర్ల దూరం పైపుల ద్వారా వెళ్లి, డెలివరీ మెయిన్ నుంచి టన్నెల్ బయట ఉన్న డెలివరీ సిస్టర్న్‌లోకి పంపింగ్ అవుతుంది. సిస్టర్న్ ద్వారా బయటకు వచ్చిన నీరు 550 మీటర్ల పొడవుతో నిర్మించిన లీడ్ చానల్ గుండా నందిమేడారం రిజర్వాయర్‌లోకి పంపింగ్ అవుతుంది. ఆ సమయంలోనే నిర్ణీత వేగం, డిజైన్‌కు అనుగుణంగా నీటి విడుదల అవుతున్నదా? ఇలా అనేక సాంకేతిక కోణాల్లో సమగ్రంగా పరిశీలించనున్నారు. ఈ వెట్న్ దాదాపు 20-30 నిమిషాలపాటు చేపట్టనున్నారు. గురువారం మరో రెండు మోటర్లకు వెట్‌ రన్‌ నిర్వహించే అవకాశాలున్నాయి.




5181
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles