ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డికి కాళోజీ పురస్కారం

Sat,September 7, 2019 12:43 PM

Kaloji award gives to writer Kotla Venkateshwar reddy

హైదరాబాద్‌ : 2019 ఏడాదికి గానూ కాళోజి నారాయణరావు అవార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వర్‌ రెడ్డికి కాళోజీ నారాయణరావు పురస్కారం వరించింది. కాళోజీ అవార్డును ప్రకటిస్తూ ఈ మేరకు భాషా సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 9న కాళోజీ 105వ జయంతి సందర్భంగా వెంకటేశ్వర్‌ రెడ్డికి అవార్డును రాష్ట్ర ప్రభుత్వం బహుకరించనుంది. పురస్కారంతో పాటు రూ.1,01,116ల నగదును ప్రభుత్వం అందజేయనుంది. 2018 సంవత్సరానికి గానూ ప్రముఖ నవలా రచయిత డాక్టర్‌ అంపశయ్య నవీన్‌కు, 2017లో ప్రముఖ కవి సీతారం, 2016లో ప్రముఖ రచయిత, గాయకుడు గోరెటి వెంకన్న, 2015 ఏడాదికి గానూ సుప్రసిద్ధ రచయిత అమ్మంగి వేణుగోపాల్‌కు కాళోజీ పురస్కారం వరించిన సంగతి తెలిసిందే.

813
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles