కాళోజీ పీజీ వైద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

Fri,March 22, 2019 09:16 PM

kaloji narayana rao health university released PG Notification

హైదరాబాద్: పీజీ వైద్య ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాళోజీ వర్సిటీ పరిధి కళాశాలలు, హైదరాబాద్ నిమ్స్ కళాశాలలో భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ అయింది. కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఉన్న సీట్ల భర్తీని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. నీట్ 2019లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 23వ తేదీ ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. పీజీ వైద్య ప్రవేశాలకు జనరల్ కేటగిరిలో 340(50 శాతం) కటాఫ్ మార్కులు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 295(40 శాతం) కటాఫ్ మార్కులు. అదేవిధంగా దివ్యాంగులు(ఓసీ)లకు 317(45 శాతం) కటాఫ్ మార్కులుగా నిర్ణయించారు. పూర్తి వివరాలు వర్సిటీ వెబ్‌సైట్ www.knruhs.inకు లాగిన్ అయి తెలుసుకోవచ్చు.

982
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles