ప్రశాంతంగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం

Thu,September 12, 2019 01:52 PM

khairatabad ganesh immersion complete at Hussain Sagar

హైదరాబాద్ : ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి నిమజ్జనోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన గణేషుడి శోభాయాత్ర ఎన్టీఆర్ మార్గ్ వరకు సుమారు ఐదు గంటల పాటు కొనసాగింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అర్చకులు గంగమ్మకు పూజలు చేశారు. అనంతరం ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్-6 వద్ద మహాగణపతిని నిమజ్జనం చేశారు. 61 అడుగుల ఎత్తు, 45 టన్నుల బరువున్న మహాగణపతిని నిమజ్జనం చేసేందుకు 400 టన్నుల సామర్థ్యం కలిగిన క్రేన్‌ను ఉపయోగించారు.

ఖైరతాబాద్‌ మహాగణపతిని కొన్ని సంవత్సరాలుగా ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నం.4 వద్దే నిమజ్జనం చేసేవారు. అయితే ప్రతి ఏడాది వినాయకుడి విగ్రహం సగం మాత్రం నిమజ్జనం అవుతుండటంతో అగమ శాస్త్ర నియమాల ప్రకారం గణపతి విగ్రహాలు గంగలో పూర్తిగా నిమజ్జనం కావాలి. దీంతో ప్రభుత్వ యంత్రాంగం విగ్రహాన్ని సంపూర్ణంగా నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేసింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రత్యేక చొరవ తీసుకొని నిమజ్జనం చేసే స్థలం మార్పు చేశారు. ఈ మేరకు డ్రోన్‌లతో సాగర్‌లో లోతు ఉన్న ప్రాంతాల డేటాను కూడా తెప్పించుకున్నారు. దీంతో క్రేన్‌ నం. 6వ వద్ద 20 అడుగులకు పైగా లోతు ఉన్నట్లు నిపుణులు సూచించడంతో అక్కడే నిమజ్జనం చేసేందుకు నిర్ణయించారు.

3610
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles