నేడు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం

Thu,September 12, 2019 08:30 AM

khairatabad ganesh immersion to be conducted today


హైదరాబాద్ : ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి నిమజ్జనోత్సవం ఇవాళ అశేష భక్త జన నీరాజనాల మధ్య జరుగనుంది. ప్రతీ ఏడాది మాదిరిగానే ఖైరతాబాద్‌ గణేశుడిని తొలి నిమజ్జనం చేస్తారు. ఆ మేరకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి, విద్యుత్‌, ఆర్‌అండ్‌బీ తదితర శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేశాయి. ఉదయం 7 గంటల నుంచి నిమజ్జన శోభయాత్ర ఖైరతాబాద్‌ గణపతి మండపం నుంచి ప్రారంభమవుతుంది. ఈ శోభాయాత్రను నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రారంభిస్తారు. 61 అడుగుల ఎత్తు 45 టన్నులకు పైగా బరువున్న విగ్రహాన్ని తరలించేందుకు అన్ని రకాల సాంకేతిక పరమైన ఏర్పాట్లు చేశారు.

క్రేన్‌ నం.6 వద్ద నిమజ్జనం..


ఖైరతాబాద్‌ మహాగణపతిని కొన్ని సంవత్సరాలుగా ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నం.4 వద్దే నిమజ్జనం చేసేవారు. అయితే ప్రతి ఏడాది వినాయకుడి విగ్రహం సగం మాత్రం నిమజ్జనం అవుతుండటంతో అగమ శాస్త్ర నియమాల ప్రకారం గణపతి విగ్రహాలు గంగలో పూర్తిగా నిమజ్జనం కావాలి. దీంతో ప్రభుత్వ యంత్రాంగం విగ్రహాన్ని సంపూర్ణంగా నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేసింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రత్యేక చొరవ తీసుకొని నిమజ్జనం చేసే స్థల మార్పు చేశారు. ఈ మేరకు డ్రోన్‌లతో సాగర్‌లో లోతు ఉన్న ప్రాంతాల డేటాను కూడా తెప్పించుకున్నారు. దీంతో క్రేన్‌ నం. 6వ వద్ద 20 అడుగులకు పైగా లోతు ఉన్నట్లు నిపుణులు సూచించడంతో అక్కడే నిమజ్జనం చేసేందుకు నిర్ణయించారు.

780
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles