వేధిస్తున్న ‘కిడ్నీ స్టోన్స్’...

Sat,June 3, 2017 11:03 AM

kidney stone symptoms

నడుము భానం నుంచి పొత్తి కడుపులోకి విపరీతంగా నొప్పి లేస్తే అది కిడ్నీలో రాళ్ల వల్లనే అని వైద్యులు చెబుతుంటారు. తాత్కాలిక నివారణకు నొప్పి నివారణ మందులు ఇచ్చినా కిడ్నీలో రాళ్లు బయటకు పోయేంత వరకు నొప్పి మాత్రం మనల్ని వదలదు. కిడ్నీలో రాళ్లు ఏర్పడి మోతాదుకు మించి పెరిగి కదలడం ప్రారంభిస్తే మనకు నొప్పి కలుగుతుంది. తగినన్ని నీళ్లు తాగకపోవడం, సమతుల ఆహారం తీసుకోక పోవడం వంటి వాటితో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి.

మూత్ర వ్యవస్థ సక్రమంగా పని చేయాలంటే ఒంట్లో తగినన్ని నీళ్లు ఉండాలి. డీ హైడ్రేషన్, పనిలో పడి నీళ్లు తాగకపోవడం, సమతులహారం తీసుకోకపోవడం, దాహం వేసిన సందర్భాల్లో నీళ్లకు బదులుగా శీతల పానీయాల మీద ఆధారపడటం వల్ల మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి.

ఎవరిలో ఎక్కువంటే..
ఒకసారి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడిన వారికి మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువని వైద్య శాస్త్రం చెబుతోంది. కుటుంబంలో ఈ సమస్య ఉన్నవాళ్లు.. దీర్ఘ కాలికంగా ఓకే ఆహార నియామాలు పాటిస్తే ఆ కుటుంబంలో ఇతర సభ్యులకు కూడా రాళ్లు ఎర్పడే అవకాశం ఉంటుందట. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వాళ్లకు అండాశయాలు తొలగించుకున్న మహిళలకు, దీంతో పాటు దీర్ఘకాలికంగా మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లతో బాధపడే వారిలో కిడ్నీ స్టోన్స్ తరచుగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. జీవనక్రియ రేటు వేగంగా పెరగడం వల్ల, మూత్రవ్యవస్థలో లోపాల వల్ల, ఖనిజాలు, లవణాలు అతిగా పేరుకోవటలం వల్ల రాళ్లు తరచుగా ఎర్పడే అవకాశముందని వైద్య శాస్త్రం చెబుతోంది. కిడ్నీ రాళ్లు ఎవ్వరికైనా రావచ్చు. ముఖ్యంగా 30 నుంచి 50 సంవత్సరాల వయసున్న వారిలో ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి.

నీళ్లకు ప్రత్యామ్నాయాలు..
అదే పనిగా నీళ్లు తాగాలన్నా ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. అలాంటి సందర్భాల్లో నీళ్లకు బదులుగా మజ్జిగ, చక్కెర కలపని పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, చెరకు రసం, బార్లీ, సబ్జానీళ్లు వంటివి తాగొచ్చు. శీతల పానీయాలు కూడా ద్రవాలే కదా అని వాటిని తాగకూడదు.

యూరినరీ ట్రాక్ట్
ఇన్‌ఫెక్షన్..

ఆరోగ్యకరమైన వ్యక్తులతో పోలిస్తే ఉబకాయం, మధుమేహ బాధితుల్లో యూరినరీ ఇన్‌ఫెక్షన్లు వస్తే వాటి ద్వారా కిడ్నీలో రాళ్లు ఎర్పడే అవకాశాలు ఎక్కువట. కాబట్టి వారు వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగుతూ ఇన్‌ఫెక్షన్ కారక బ్యాక్టీరియాలను మూత్రం ద్వారా బయటకు పంపించే ప్రయత్నం చేయాలి. అలాగే మధుమేహం, ఊబకాయాన్ని అదుపులో ఉంచుకోవాలి. మూత్రం పోసేటపుడు నొప్పి, మూత్రం చిక్కగా అవ్వడం, వాసనతో ఉండటం, మూత్రం రంగు మారడం వంటి లక్షణాలు కిడ్నీలో రాళ్లు ఉన్నాయనడానికి ఆనవాళ్లని వైద్యులు చెబుతున్నారు.

అత్యాధునిక చికిత్సలు..
కిడ్నీలో రాళ్లకు చేసే సర్జరీల్లో ఇప్పుడు అత్యాధునిక పద్ధతులెన్నో అందుబాటులోకి వచ్చాయని వైద్యనిపుణలు చెబుతున్నారు. రాళ్లు మరీ పెద్దవిగా ఉంటే తప్ప ఓపెన్ సర్జరీ చేసే అవసరం ఉండదు. ఎండోస్కోపీ, లేజర్ సర్జరీ ద్వారానే ఎక్కువ శాతం రాళ్లను తీసేయవచ్చట. కాస్త పెద్ద రాయి అయితే లాప్రోస్కోపీ లేదా కిడ్నీకి రంథ్రం వేసి తీసే అత్యాధునిక పద్ధతుల్ని వైద్యులు అవలంభిస్తారు. లేజర్, ఎండోస్కోపీ చేయించుకున్న వాళ్లు సర్జరీ చేసిన మరుసటి రోజు నుంచి, లాప్రోస్కోపీ, కిడ్నీకి రంథ్రం వేసి చేసే సర్జరీ చేయించుకున్న వాళ్లు వారం తరువాత అన్ని పనులు చేసుకోవచ్చు. వీటిలో ఏ సర్జరీ చేయించుకున్నా నొప్పి ఉండదు. ఇక యూటీఐ వచ్చిన రోగులకు కారణాన్ని బట్టి చికిత్స విధానాలు మారుతాయి.

నీళ్లు బాగా తాగాలి..
చాలామందికి దాహం వేసినప్పుడు తప్ప మిగతా సమయాల్లో నీళ్లు తాగే అలవాటుండదు. కానీ నిజానికి మనకు దాహం వేసిదంటే అప్పటికే మన ఒంట్లో నీటి పరిమాణం తగ్గిపోయిందని అర్థం. దాహం వేసినా వేయక పోయినా గంట గంటకూ ఓ గ్లాసు చొప్పున నీళ్లు తాగుతూ ఉండాలి. ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్లు. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు ఉన్న వాళ్లు ఈ నియమాన్ని తప్పకుండా పాటించాలి.

4094
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles