సాహో సినిమాపై కేటీఆర్ ప్రశంసలు

Mon,September 2, 2019 12:30 PM

హైదరాబాద్: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన సాహో సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ఈ రోజు రెండు తెలుగు సినిమాలు చూశాననీ.. సాహో సాంకేతికంగా భారీ స్థాయిలో ఉంది. ఇండియన్ సినిమా మేకర్స్‌ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిందని, హీరో ప్రభాస్, దర్శకుడు సుజీత్‌కు శుభాకాంక్షలు చెప్పారు. మరో సినిమా ఎవరు కూడా బాగుందని, ముఖ్యంగా స్క్రీన్‌ప్లే చాలా బాగుందన్నారు. నటీనటులు అడవి శేష్, రెజీనా, నవీన్‌లను ఆయన ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు.


కాగా, ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సాహో సినిమాపై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, కలెక్షన్స్ మాత్రం రికార్డు స్థాయిలో రాబడుతోంది. రెండు రోజులకు గానూ 205 కోట్ల రూపాయలు రాబట్టింది.


1778
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles