హైదరాబాద్ అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది: కేటీఆర్

Wed,August 14, 2019 06:27 PM

ktr inaugurates JLL new office at Salarpuria Sattva Knowledge City


హైదరాబాద్ : రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో జెఎల్‌ఎల్‌ కంపెనీ ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..హైదరాబాద్‌ నగరం సుస్థిరమైన టీఆర్ఎస్‌ పాలనలో అన్ని రంగాల్లో దూసుకెళుతోందన్నారు. భౌగోళికంగా, వాతావరణ పరంగా, మౌళిక వసతుల పరంగా అనుకూలతలున్న హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తోందన్నారు. నగరంలో రియల్‌ ఎస్టేట్ రంగంలో ఎప్పటిలాగానే అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆఫీస్‌ స్పేస్‌తోపాటు, గృహ నిర్మాణ రంగంలోనూ హైదరాబాద్‌లో మార్కెట్ వాల్యూ అంతకంతకూ పెరుగుతోందని కేటీఆర్ స్పష్టం చేశారు.

హైదరాబాద్ నగరంలో ఐటీ అభివృద్ధి, అందుకు తగిన మౌళిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని కేటీఆర్ ఈ సందర్భగా వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలన్నీ హైదరాబాద్‌ వైపు చూస్తున్నాయని..అన్ని విధాలా అనుకూలతలున్న హైదరాబాద్‌ ఐటీ రంగంలో మరింత అభివృద్ధి చెందడం ఖాయమని కేటీఆర్ ధీమావ్యక్తం చేశారు. భవిష్యత్ లో ఐటీ ఎగుమతుల్లో బెంగలూర్‌ను హైదరాబాద్‌ అధిగమిస్తుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. 2014లో నగరంలో ఐటీ ఎగుమతులు రూ. 52 కోట్లు ఉంటే… ప్రస్తుతం లక్షా 9 వేల కోట్ల రూపాయలకు పెరిగిన సంగతిని కేటీఆర్ గుర్తు చేశారు. పెరుగుతున్న అభివృద్ధికి తగ్గట్టుగా హైదరాబాద్‌లో మౌళిక వసతులను కల్పించడం ఎంతో కీలకమని..ప్రభుత్వం ఆ దిశగా ఎంతో కృషి చేస్తుందని కేటీఆర్ వెల్లడించారు.

నగరం తూర్పు వైపు కూడా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా లుక్ ఈస్ట్ పాలసీని తీసుకొస్తామని కేటీఆర్ తెలిపారు. తూర్పు వైపున ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తామని చెప్పారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్‌ వినియోగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం నగరంలో 36 శాతం మంది మాత్రమే ప్రజారవాణాను వినియోగిస్తున్నారని గుర్తు చేశారు. అటు రాయదుర్గం నుంచి శంషాబాద్ ఏయిర్ పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ సెక్రెటరీ జయేశ్ రంజన్, జేఎల్‌ఎల్‌ కంపెనీ ప్రతినిదులు పాల్గొన్నారు.

1296
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles