సౌదీలో యువకుడి కష్టాలు.. కేటీఆర్ అండ

Wed,May 15, 2019 01:15 PM

KTR Responds to Saudi victim Sameer who treated badly in saudi by his owner

హైదరాబాద్: గల్ఫ్ దేశం సౌదీలో అష్టకష్టాలు పడుతున్న తెలంగాణ యువకుడు సమీర్‌ను ఇండియా తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. సమీర్ కుటుంబ సభ్యుల విజ్ఞప్తిపై, సమీర్ తను సౌదీలో పడుతున్న బాధను వీడియో ద్వారా కేటీఆర్‌కు విన్నవించడంపై కేటీఆర్ వెంటనే స్పందించారు.

గత నెలలో ఉపాధి కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన సమీర్ సౌదీకి వెళ్లాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ ఏజెంట్ సౌదీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి సమీర్‌ను సౌదీకి పంపించాడు. అయితే.. అక్కడ యజమాని సమీర్‌ను గొర్రెల కాపరిగా పెట్టుకున్నాడు. తిండి కూడా పెట్టకుండా.. ఆ యజమాని సమీర్‌ను చిత్రహింసలు పెడుతుండటంతో ఏం చేయాలో తెలియని సమీర్.. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలపడంతో పాటు.. వీడియో ద్వారా కేటీఆర్‌కు చేరవేశాడు. దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్.. సమీర్‌ను ఇండియా రప్పించడానికి వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వెంటనే సౌదీ అరేబియాలో ఉన్న ఇండియన్ ఎంబసీకి ట్వీట్ చేసి.. సమీర్‌ను ఇండియాకు పంపించే ఏర్పాట్లు చేయాలన్నారు.
2199
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles