రేపు నల్గొండలో మంత్రి కేటీఆర్ పర్యటన

Sun,September 22, 2019 08:04 PM

హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) రేపు నల్గొండలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో కేటీఆర్.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దసరా పండుగ పర్వదినాన తెలంగాణ ఆడపడుచులు అందరూ కొత్త చీరలు ధరించాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా, మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

724
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles