కొడంగల్‌లో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం

Sat,December 30, 2017 07:53 PM

Lentils purchase center start in Kondagal

వికారాబాద్: జిల్లాలోని కొడంగల్ పట్టణ కేంద్రంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి నేడు కందుల కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. కందుల కొనుగోలుకు రాష్ట్రంలో 95 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్వింటాలుకు రూ. 5454 మద్ధతు ధర అందిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో రైతాంగం కోసం ఎకరాకు రూ. 8 వేల పెట్టుబడి అందించనున్నట్లు అదేవిధంగా డిసెంబర్ 31 అర్థరాత్రి నుంచి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. వెనుకబడిన కొడంగల్ నియోజకవర్గంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిధులు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.

2527
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles