డీఎంఈ సంతకాలను ఫోర్జరీ చేసిన వ్యక్తి అరెస్టు

Mon,July 8, 2019 10:12 AM

Man arrested for forgery DME signatures hyderabad

హైదరాబాద్ : నకిలీ సంతకాలతో ఒరిజినల్ డిప్లొమా సర్టిఫికెట్ ఆఫ్ నర్సింగ్‌ను సృష్టించి విద్యార్థులకు అందించి మోసాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసిన సంఘటన సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ మాధవరెడ్డి కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా పొన్నాలలోని వెంకటసాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో డైరెక్టర్ తుపాకుల బాల రంగం, క్లర్క్ తరిగొప్పుల బాలనర్సయ్య విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు సప్టిమెంటరీ పరీక్షల్లో భాగంగా నర్సింగ్ డిప్లొమా సర్టిఫికెట్‌లను అందించే క్రమంలో కళాశాల క్లర్క్ బాలనర్సయ్య ఒరిజినల్ సర్టిఫికెట్‌లపై స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ జ్యోతి, నర్సింగ్ డిప్యూటీ డైరెక్టర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్‌రెడ్డి సంతకాలను ఒరిజినల్ నర్సింగ్ డిప్లొమా సర్టిఫికెట్‌లపై ఫోర్జరీ చేశాడు. కాగా, క్లర్క్ బాలనర్సయ్య సూచనల మేరకు విద్యార్థులకు డైరెక్టర్ తుపాకుల బాలరంగం సర్టిఫికెట్‌లను జారీ చేశారు. సర్టిఫికెట్‌లు నకిలీవని డీఎంఈ రమేశ్‌రెడ్డి దృష్టికి రావడంతో రమేశ్‌రెడ్డి సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సుల్తాన్‌బజార్ పోలీసులు సంతకాల ఫోర్జరీకి పాల్పడిన వెంకటసాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల క్లర్క్‌ను అరెస్టు చేశారు. కాగా, ఈ కేసులో మరో నిందితుడైన కళాశాల డైరెక్టర్ బాలరంగం పరారీలో ఉన్నట్లు ఎస్‌ఐ వివరించారు.

770
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles