మార్కెటింగ్ ఉద్యోగి నిజాయితీ.. బంగారం బ్యాగును పోలీసులకు అప్పగింత

Thu,October 10, 2019 08:50 AM

చందానగర్: బాచుపల్లి కౌసల్య కాలనీకి చెందిన వీఎస్ ఆర్ ప్రసాద్ మార్కెటింగ్ ఉద్యోగి. విధినిర్వహణలో భాగంగా బుధవారం కొండాపూర్ వైపు వెళుతుండగా హఫీజ్‌పేట్ గ్రీన్‌బావర్చి హోటల్ వద్ద ఒక బ్యాగ్ దొరికింది. అది తెరిచి చూడగా 3.5 తులాల బంగారం ఆభరణాన్ని గుర్తించాడు. వెంటనే ఆ బ్యాగును మియాపూర్ పోలీసులకు అందజేశాడు. దీంతో పోలీసులు ఎంక్వైరీ చేయగా గుంటురు జిల్లా నుంచి ఓ ఫంక్షన్‌కోసం వచ్చిన ఎస్‌కే షహనాజ్ అనే మహిళ గ్రీన్ బావర్చి వద్ద ఆగింది. అక్కడి నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్లే క్రమంలో ఆటోలో తన బ్యాగ్ పోగొట్టుకున్నట్టు గుర్తించారు. దీంతో పోలీసులు ప్రసాద్ చేతుల మీదుగా బాధితురాలు షహనాజ్‌కు బ్యాగ్‌ను అప్పగించారు. ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ ప్రసాద్‌ను సత్కరించి అతని నిజాయితీని అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఐ మహేష్‌గౌడ్, ఎస్‌ఐ రఘురామ్, ప్రసాద్, రవికిరణ్, అప్పారావు పాల్గొన్నారు.

1983
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles